- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులపై కేసులు ఎత్తేయాలి : టీయూడబ్లూజే
లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని కోరుతూ టీయూడబ్లూజే రాష్ట్ర నాయకులు డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. లాక్‌డౌన్‌లో అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్న తీరును రిపోర్ట్ చేసినందుకు మధిరలో జర్నలిస్టులపై కేసు నమోదు చేశారని డీజీపీకి వివరించారు. నిర్మల్‌లోనూ కరోనా న్యూస్ కవరేజ్ విషయంలోనే జర్నలిస్ట్‌లపై కేసు పెట్టారని, నారాయణ్ ఖేడ్‌లో ఇసుక మాఫియాపై వార్తను ప్రసారం చేసినందుకు స్థానిక రిపోర్టర్‌పై కేసు పెట్టారని డీజీపీకి విన్నవించారు. దీనిపై డీజీపీ వెంటనే స్పందించి ఖమ్మం పోలీస్ కమిషనర్, నిర్మల్, సంగారెడ్డి ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి జర్నలిస్ట్‌లపై పెట్టిన కేసులను సమీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో టీయూడబ్లూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, తెంజు నగర అధ్యక్షులు సంపత్ ఉన్నారు.
Tags: Journalists, TUWJ, Police cases, DGP, lockdown rules