- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఎంపీ అర్వింద్ రాజీనామా చేస్తే.. మళ్లీ గెలిపించుకుంటాం’
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీగా గెలిచిన ఐదురోజుల్లో నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని చెప్పి, ఇప్పుడు చెప్పలేదని మాటమార్చిన ధర్మపురి అర్వింద్‌పై పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రైతులను చర్చలకు పిలిచిన ఎంపీ అర్వింద్, అర్ధాంతరంగా సమావేశం మధ్యలో వెళ్లిపోయారని మండిపడ్డారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ… తమ ప్రశ్నలకు ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారని అన్నారు. ఎంపీ వైఖరిని నిరసిస్తూ.. పసుపు ఉద్యమంపై కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా ఎంపీ అర్వింద్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. అర్వింద్ రాజీనామా చేస్తే.. మేము మళ్లీ గెలిపించుకుంటామని అన్నారు.
Next Story