మగవారిలో ‘టెస్టోస్టిరాన్’ తగ్గితే ఏమవుతుంది?

by sudharani |
మగవారిలో ‘టెస్టోస్టిరాన్’ తగ్గితే ఏమవుతుంది?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రపంచం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు కరోనా దెబ్బకు దివాళా తీశాయి. వ్యాక్సిన్ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాఖ్యలు అందరినీ గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇదిలాఉండగా, రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ విజయవంతమైందని, క్లినికల్ ట్రయల్స్ చేయించుకున్న వారంతా క్షేమంగా ఉన్నారని ఆ దేశం ప్రకటించింది. మరోవైపు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయని భారత్‌తో సహా వివిధ దేశాలు ప్రకటించాయి. అయితే, కరోనా బారిన పడిన వారిలో కొందరు భవిష్యత్తులో కొత్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

క‌రోనా సోకిన పురు‌షుల్లో టెస్టో‌స్టె‌రాన్‌ హార్మోన్‌ స్థాయిలు తగ్గు‌తు‌న్నట్టు టర్కీ పరి‌శో‌ధ‌కులు గుర్తించారు. దీనివలన వారిలో లైంగిక వాంఛ కూడా తగ్గిపోతున్నట్లు వెల్లడించారు. టెస్టో‌స్టె‌రాన్‌ క్షీణిస్తే రోగ‌ని‌రో‌ధక శక్తి కూడా తగ్గిపోతుందని, దీంతో శ్వాస సంబం‌ధిత సమ‌స్యలు కూడా త‌లెత్తే అవ‌కా‌శ‌ముందని టర్కీ‌లోని మెర్సిన్‌ యూని‌వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త సెలా‌హి‌టిన్‌ కాయన్‌ తెలిపారు.

క‌రోనా తీవ్రత ఎక్కు‌వగా ఉన్న పురు‌షుల్లో టెస్టో‌స్టె‌రాన్‌ తగ్గు‌తు‌న్నట్లు పరిశోధనల్లో వెల్లడైందన్నారు. ముఖ్యంగా లక్ష‌ణాలు లేని రోగు‌లతో పోలిస్తే, ఐసీ‌యూలో చికిత్స తీసు‌కుంటున్న కొవిడ్ రోగుల్లో ఈ ప్రభావం ఎక్కు‌వగా ఉన్నట్లు వివరించారు. 438 మంది క‌రోనా రోగు‌లపై నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెలుగు చూశాయన్నారు. ‘శ్వాస సంబం‌ధిత అవ‌య‌వాల రోగ‌ని‌రో‌ధక శక్తికి, టెస్టో‌స్టె‌రా‌న్‌కు మధ్య సంబం‌ధ‌ము‌న్నదని చెప్పారు. ఈ హార్మోన్‌ స్థాయిలు తగ్గితే, శ్వాస సంబం‌ధిత సమ‌స్యలు కూడా పెరు‌గు‌తాయి’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed