టర్కీలో సరికొత్త నిబంధనలతో లాక్‌డౌన్ సడలింపు

by vinod kumar |
టర్కీలో సరికొత్త నిబంధనలతో లాక్‌డౌన్ సడలింపు
X

అంకారా: ఆసియా, యూరోప్ దేశాలకు గేట్‌వేగా పిలిచే టర్కీ దేశంలో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. గత పాతిక రోజులకు పైగా అక్కడి ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తోంది. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే టర్కీ ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా వెలవెలబోతోంది. ఇప్పటికే టర్కీలో 78 వేల మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. 1,700 మందికి పైగా మరణాలు సంభవించాయి. కాగా, గత కొన్ని రోజులుగా ఇక్కడ కేసుల నమోదు, మరణాల రేటు తగ్గింది. దీంతో లాక్‌డౌన్ నిబంధనలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏ దేశంలోనూ అమలు చేయని విధంగా వయస్సుల వారీగా నిబంధనల సడలింపునకు టర్కీ మార్గదర్శకాలు రూపొందించింది. వారాంతరాల్లో ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం తెలిపింది. ఇక మిగిలిన రోజుల్లో 20 ఏండ్ల లోపు వాళ్లు, 60 ఏళ్లు పైబడిన వాళ్లు బయటకు అస్సలు రావొద్దని.. వాళ్లు ఇండ్లకే పరిమితం అవ్వాలని సూచించింది. 21-59 ఏండ్ల వయస్సు వ్యక్తులు బయటకు వచ్చినా భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. కేవలం నిర్మాణ రంగం, పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని.. వాటిలో పని చేసే వాళ్లే బయటకు రావాలని ఆదేశించింది. రెస్టారెంట్లు తెరిచి ఉంచొచ్చు కానీ.. కేవల ఫుడ్ డెలవరీ, పికప్ ఆర్డర్లు మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. బ్యాంకులు కొన్ని గంటల మాత్రమే పని చేయాలని.. చిన్న వ్యాపార సంస్థలు మూసేయాలని ఆదేశించింది.

tags: coronavirus, lockdown, regulations, turkey, ankara, exemptions, fatalities

Next Story

Most Viewed