బాల్య స్నేహితులతో సరదాగా గడిపిన ఎమ్మెల్యే

by Shyam |
Tungaturthi MLA Gadari Kishore Kumar
X

దిశ, మునుగోడు: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ శుక్రవారం నారాయణపురం మండల కేంద్రంలోని ఆయన బాల్య స్నేహితులను కలిశారు. స్నేహితులతో కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న తన బాల్య స్నేహితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా, చిన్నతనంలో ఎమ్మెల్యే కిషోర్ నారాయణపురం మండల కేంద్రంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి స్నేహితులు అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకొని, వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందించారు. అనంతరం మండల కేంద్రంలో సరదాగా కాసేపు తిరిగి చిన్ననాటి జ్ఞాపకాలను స్నేహితులతో నెమరువేసుకున్నారు. ఆయన వెంట స్నేహితులు ఉప్పల లింగస్వామి, కొండ రమేష్, అజార్, బాలరాజు తదితరులున్నారు.

Tungaturthi MLA Gadari Kishore Kumar

Advertisement

Next Story