పిచ్చోడి చేతికి ఏకే 47లా… జగన్ పాలన

by Ramesh Goud |
పిచ్చోడి చేతికి ఏకే 47లా… జగన్ పాలన
X

ఏపీలో రౌడీ పాలన సాగుతోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. పిచ్చోడి చేతికి ఏకే 47 తుఫాకీ ఇచ్చినట్లు.. జగన్ పాలన ఉందంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే రూ.35 వేల కోట్ల అప్పులు చేశారని తులసీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు బుద్దిలేని చర్య అన్నారు. కోడికత్తి కేసు, వివేకా హత్య కేసు నిందితులను ఇంత వరకూ తేల్చకపోవడానికి కారణం చెప్పాలని తులసీరెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed