శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్‌లైన్‌ సేవలో పాల్గొనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో కళ్యాణోత్సవ సేవ చేసుకున్న భక్తులను 90రోజుల్లో ఎపుడైనా సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రసాదం మాత్రం పోస్టల్ ద్వారానే పంపణీ చేస్తామని పేర్కొన్నారు.

Advertisement