- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్ లైన్ శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టికెట్లను… ఈ నెల 6వ తేదీ నుంచి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి 31 వరకు ఈ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు కేవలం ఆన్‌లైన్‌లోనే పాల్గొనాలని.. ఇందుకోసం తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ప్రతీ రోజు మధ్యహ్నం 12 గంటలకు భక్తులు ఈ సేవలో పాల్గొనాలని స్పష్టం చేసింది. అటు పూజలో పాల్గొనే వారు ఇంటి వద్ద నున్నా సంప్రదాయ దుస్తులనే ధరించాలని సూచనలు చేసింది. భక్తులకు ఆన్ లైన్ ద్వారా ప్రసాదాలను పంపిణీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం గమనార్హం. కరోనా వైరస్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది.
Next Story