- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీటీడీ కీలక నిర్ణయం.. కొండపై ఇక ఆ చెట్లు కనిపించవు.?
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండల్లో సుమారు 2వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేషియా చెట్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యంలో మార్పులు రావడంతో పాటు, చెట్ల కింద భూసాంద్రత దెబ్బతింటోందని స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు పరిశోధనలో తేలింది. అలాగే చెట్ల కింద పీహెచ్ 4.5 శాతానికి చేరుకుని భూమిలో ఆమ్లాల శాతం ఎక్కువవుతోందని స్టేట్ బయోడైవర్శిటీ బోర్డు పరిశోధనలో నిరూపితమైంది.
అకేషియా మెుక్కలపై బయోడైవర్సిటీ చేసిన పరిశోధనల నివేదికను సంస్థ ప్రతినిధులు ఇటీవలే టీటీడీ బోర్డుకు అందజేసింది. దాంతో చివరి టీటీడీ పాలకమండలిలో ఈ అంశంపై చర్చించి చెట్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అకేషియా చెట్లను విడతల వారీగా పదేళ్లలోపు తొలగించాలని టీటీడీ నిర్ణయించింది. ఆ చెట్ల స్థానంలో పురాణాల్లో విశేషంగా వర్ణించబడిన చెట్లను పెంచాలని టీటీడీ భావిస్తోంది.