జగన్ చేస్తోంది ఇదే.. టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
TTD C
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైద్యం పేరుతో పేదలు అప్పుల పాలవ్వకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రూ. 35 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రికి వైవీ సుబ్బారెడ్డి భూమి పూజ చేశారు. త్వరలోనే నిర్మాణ ప‌నులు పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవ‌లు అందించేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక పేద‌లు వైద్యం కోసం అప్పుచేయాల్సిన ప‌రిస్థితులు లేవ‌న్నారు. క‌రోనా కష్టకాలంలో పేద‌ల‌కు ఉచితంగా వైద్యం అందించి ఆదుకున్న ఘ‌న‌త సీఎం వైఎస్ జ‌గ‌న్‌దే అన్నారు. ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా ఎంతోమంది పేద‌ల‌కు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నార‌ని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు సుభాష్ చంద్రబోస్‌, చింతా అనురాధ‌, ఎమ్మెల్యేలు జ‌గ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story