కేంద్రానికి టీఎస్​యూటీఎఫ్​ సర్వే నివేదిక

by  |
కేంద్రానికి టీఎస్​యూటీఎఫ్​ సర్వే నివేదిక
X

దిశ, న్యూస్​బ్యూరో: పాఠశాలల పునర్​ ప్రారంభం, విద్యాబోధన ఏ విధంగా ఉండాలనే అంశాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను జూలై 20లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ కోరిన నేపథ్యంలో టీఎస్​యూటీఎఫ్​ ఇటీవల నిర్వహించిన సర్వే రిపోర్టును అందజేసింది. తల్లిదండ్రుల, విద్యార్థుల అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను, టీఎస్​యూటీఎఫ్​ సూచనలతో సహా కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ సంప్లేకి సోమవారం ఈ మెయిల్ ద్వారా పంపించినట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి తెలిపారు. విద్యా సంవత్సరం నిర్వహణ, పాఠశాలల పునర్​ప్రారంభం, ఆన్లైన్ విద్యా బోధనకు గల అవకాశాలు, అవరోధాలు తదితర 20 అంశాలపై జూన్ 22 నుంచి 27 వరకు 33 జిల్లాల్లోని 489 మండలాల్లో 1,868 గ్రామాలు/ మునిసిపల్ వార్డుల్లో సర్వే నిర్వహించి సేకరించిన సమాచారంతో రూపొందించిన సమగ్రమైన నివేదికను జూలై 3వ తేదీన విడుదల చేసిన విషయం విధితమే. ఆ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యామంత్రి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. సేకరించిన సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోపడనున్నదని టీఎస్​యూటీఎఫ్​ రాష్ట్ర కమిటీ తెలిపింది.


Next Story

Most Viewed