ఆ అభ్యర్థులకు TSPSC హెచ్చరిక

by Shyam |   ( Updated:4 Aug 2021 10:41 PM  )
ఆ అభ్యర్థులకు TSPSC హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏఎన్ఎమ్, ఎమ్‌.పీ.హెచ్.ఓ ఉద్యోగాల పరీక్షకు హాజరైన అభ్యర్థులను టీ.ఎస్.పీ.ఎస్.సీ హెచ్చరించింది. ఆ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు టీఎస్ పీఎస్ కీలక హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తమ సర్వీస్, అర్హతలు నమోదు చేయడానికి ఆగష్టు 10 వరకు గడువు పొడిగించినట్టు తెలిపింది. నిర్ణిత సమయంలోగా సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయకుండా, ఆలస్యం చేస్తూ ఉద్యోగాలకు అర్హత కోల్పోతే తమ బాధ్యత ఉండదని స్పష్టం చేసింది. అయితే ఈ పరీక్షలకు మొత్తం 14, 409 మంది హాజరయ్యారు. కానీ ఇప్పటి వరకు 4100 మంది కూడా స్పందించక పోవడం గమనార్హం.

Next Story