- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో ‘ఇన్వెస్ట్‌మెంట్ సేల్’.. ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆహ్వానం
దిశ, తెలంగాణ బ్యూరో : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలోనే ఇన్వెస్టిమెంట్ సేల్‌ను ఏర్పాటు చేయాలని టీఎస్ఐఐసీ( తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) యోచిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిపార్టు మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ), వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ, ఎఫ్ఐసీసీఐ ఆధ్వర్యంలో కేంద్రం జాతీయస్థాయిలో ఇన్వెస్ట్ మెంట్ సేల్ నిర్వహిస్తోంది. అదే తరహాలో రాష్ట్రంలోనూ ఇన్వెస్ట్ మెంట్ సేల్ ను ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తోంది. రాష్ర్ట ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ఆసక్తి ఉండి పరిశ్రమలను స్థాపించాలనుకునే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వారి ఆసక్తిని బట్టి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. ఔత్సాహికులు తమ ఆసక్తికి అనుగుణంగా ఎంపిక చేసుకున్న పారిశ్రామిక వాడలో ప్లాట్లను పొందేందుకు జోనల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి 15న ఇన్వెస్ట్ మెంట్ ఇండియా అధికారులు రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక సేల్ ఏర్పాటు చేసి రాష్ర్టంలోని అవకాశాలను వివరిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కోరారు.
మేడ్చల్ జోన్‌లో..
కుషాయిగూడ, మౌలాలి, సిద్దిపేట, మందపల్లి, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి పారిశ్రామిక వాడల్లో గ్రీన్ క్యాటగిరీ యూనిట్లు, జీడిమెట్ల, కుదారంలో జనరల్ క్యాటగిరీ యూనిట్లు, బీటీ పార్కు, ఫేస్-2లో బయోటిక్ ఇండస్ర్టీస్, బీటీ పార్కు, కర్కపట్లలో బయోఫార్మా, ఆర్ అండ్ డీ, వ్యాక్సిన్ యూనిట్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. తుప్రాన్ పేటలో ఆటోమోటివ్ ఆధారిత ఇండస్ర్టీస్ ప్లాంట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
పటాన్ చెరువు జోన్..
పాశమైలారం, సుల్తాన్ పూర్ లో జనరల్ క్యాటగిరీ, ఇంద్రకరన్ రీ లొకేషన్ ఆఫ్ టెక్స్ టైల్ ఇండస్ర్టీస్, బుచ్చెనపల్లి ఎడిబుల్ అయిల్ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
శంషాబాద్ జోన్..
ఆదిభట్ల, ఏరోస్పేస్ సెజ్, నాదర్ గుల్‌లో ఏరోస్పెస్ యూనిట్లు, మంకాల్ ప్లాస్టిక్ పార్కుల్లో ప్లాస్టిక్ యూనిట్లు, జడ్చర్లలో గ్రీన్ ఇండస్ర్టీస్, పాలెం, మహేశ్వరంలో జనరల్ ఇండస్ర్టీస్, ఈ సిటీ సెజ్ లో సోలార్, ఫ్యాబ్ ఇండస్ర్టీస్ కు ఈఎంసీ మహేశ్వరంలో ఎలక్ర్టిక్ వస్తువులు తయారీ యూనిట్లకు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
సైబరాబాద్ జోన్..
వికారాబాద్ ఇండస్ర్టీయల్ పార్కులో జనరల్ ఇంజనీరింగ్ యూనిట్లు, రకం చెర్ల పారిశ్రామికవాడలో స్టీల్ రీ రోలింగ్ యూనిట్లు, ఏఎన్ కోకట్ పారిశ్రామిక వాడలో ఆటో మోటివ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం.
వరంగల్ జోన్..
మడికొండ, కల్లెం, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుల్లో టెక్స్ టైల్ యూనిట్లు, మడికొండలో ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లు ఏర్పాటుకు ప్లాట్లు ఉండగా, రాంపూర్ పారిశ్రామిక వాడను జనరల్ క్యాటగిరీలో ఉంచారు.
కరీంనగర్ జోన్..
కుందనపల్లి పారిశ్రామికవాడలో ఆటోమోటివ్ ఆధారిత పరిశ్రమల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
యాదాద్రి జోన్..
కోదాడ పారిశ్రామిక వాడను జనరల్ క్యాటగిరీకి, రాయిరావ్ పేట్ ను జనరల్ ఎస్ఎంఈ యూనిట్లకు రిజర్వు చేశారు.
ఖమ్మం జోన్..
భద్రాచలం, కొత్తగూడెం, అన్నారగూడెం, పాల్వంచ పారిశ్రామిక వాడల్లో జనరల్ పరిశ్రమల ఏర్పాటుకు, బుగ్గపాడు పారిశ్రామిక వాడలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. పాల్వంచలో జనరల్ పారిశ్రామిక వాడలో 18 షెడ్లు ఖాళీగా ఉన్నాయి.
నిజమాబాద్ జోన్..
బోధన్‌లో ఆటోమోటివ్, నిర్మల్, సారంగపూర్లో జనరల్ క్యాటగిరీ పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.