- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జూన్ 7 నుంచి టీఎస్ పీఈసెట్ పరీక్షలు
by Harish |

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి గాను టీఎస్ పీఈసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. గురువారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి షెడ్యూల్‌ను ప్రకటించారు. మార్చి ఒకటి నుంచి నోటిఫికేషన్ వెలువడనుండగా, మూడు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారులకు అందుబాటులోకి రానుంది. దరఖాస్తుకు గడువు మే ఎనిమిది వరకు ఉండగా, జూన్ ఏడు నుంచి ఫిజికల్ టెస్టులు ప్రారంభం కానున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రూ.400, జనరల్ కేటగిరీకి చెందిన వారికి రూ.800 ఫీజుగా నిర్ణయించారు. ఫీజు ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు https://pecet.tsche.ac.in వెబ్ సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
Next Story