కరోనా నివారణకు అప్రమత్తత అవసరం..

by Shyam |   ( Updated:2020-08-01 06:43:27.0  )
కరోనా నివారణకు అప్రమత్తత అవసరం..
X

దిశ, అచ్చంపేట: కరోనా మహమ్మారి నివారణకు నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. శనివారం తన నివాసంలో నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండల అధికారులు , ప్రజాప్రతినిధులతో జూమ్ యాప్ ద్వారా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్నిశాఖల అధికారులతో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లోని ప్రజలకు కరోనా నివారణపై మరింత అవగాహన కల్పించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. మండలంలోని అభివృద్ధి పనులపై ఆరా తీసిన ఆయన త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వైద్యాధికారులు కరోనా వైరస్ ప్రభావం, నమోదవుతున్న కేసుల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని గుర్తుచేశారు. ఇందులో ఎంపీపీ, జెడ్పీటీసీ, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో, ఎస్‌ఐ, వైద్య అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed