పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్

by Shyam |
పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్
X

దిశ, మహబూబ్ నగర్: లాక్‌డౌన్ వేళ నిరుపేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం వనపర్తి పరిసర ప్రాంతాల్లోని 25 చెంచు కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయి తిండి లేక అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందుతోందని, కొన్ని ప్రాంతాల్లో అది కూడా అందడం లేదని విమర్శించారు. విపత్కర సమయంలో రేషన్ కార్డులతో సంబంధం లేకుండా పేదలైన ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలని వారు సూచించారు.

Tags: ts govt fail, to help poor people, ex minister chinna reddy



Next Story

Most Viewed