బీర్లు అమ్మేందుకు డెడ్ లైన్ ఎప్పుడో తెలుసా!

by Shyam |   ( Updated:2020-05-15 09:59:06.0  )
బీర్లు అమ్మేందుకు డెడ్ లైన్ ఎప్పుడో తెలుసా!
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌కు పది రోజుల ముందే మూతపడ్డ రాష్ట్రంలోని బార్లు, పబ్బులు, క్లబ్బులకు త్వరలో కాలం చెల్లిపోనున్న బీరు నిల్వల విషయంలో ఊరట లభించింది. వాటిలో ఉన్న బీరు బాటిళ్లన్నింటినీ సమీపంలో ఉన్న ఆయా వైన్ షాపులకు అమ్ముకోవచ్చని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. ఈ నెల 17 నుంచి 31 వరకు బెస్ట్ బిఫోర్ డేట్ ముగిసిపోయే బీర్లనే విక్రయించాలని తెలిపింది. సాధారణంగా తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ వైన్‌షాపులకు అమ్మే రేట్లకే బీరు బాటిళ్లు ఇవ్వాలని బార్లను ఆదేశించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఎక్సైజ్ స్టేషన్‌ల వారిగా ఏ స్టేషన్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, పబ్బుల్లోని బీర్లను అదే స్టేషన్ పరిధిలోని వైన్ షాపులకు అమ్ముకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వేళ ఎవరైనా ప్రత్యేకంగా ఒక షాపుకు అమ్ముకోవాలనుకుంటే అనుమతివ్వాలని రాష్ట్రంలోని ఎక్సైజ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌లను ఆదేశించింది. ఒకవేళ ఒక స్టేషన్ పరిధిలో ఉన్న బీరు నిల్వలకు అక్కడ ఉన్న షాపులు సరిపోకపోతే ఆ ఎక్సైజ్ జిల్లాలోని ఏ షాపుకైనా అమ్ముకోవచ్చని తెలిపింది. ఈ బీరు తరలింపు మొత్తం శనివారం ఉదయానికి పూర్తవ్వాలని డెడ్‌లైన్ పెట్టింది. బీరు తరలింపు ప్రక్రియనంతా డిప్యూటీ కమిషనర్‌లు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed