- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆగస్టు 3న టీఎస్ ఈ సెట్ పరీక్ష

X
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ ఈ సెట్ పరీక్షను ఆగస్ట్ 03న నిర్వహించనున్నట్లు జేఎన్ టీయూ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్టు బుధవారం టీఎస్ ఈసెట్ కన్వీనర్ వెంకట రమణ రెడ్డి తెలిపారు. ఈ నెల 29న మధ్యాహ్నం 1 నుంచి వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
పరీక్షలపై అవగాహన కోసం ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. తరగతుల షెడ్యూల్, టైం స్లాట్‌లను వెబ్‌సైట్‌లో తెలియజేస్తామని వివరించారు. వెబ్‌సైట్ లో మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉందని, ఈ సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌లో పొందుపరిచిన నిబంధనలను పాటించాలని తెలిపారు.
Next Story