- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎంసెట్ ఎప్పుడంటే….
దిశ వెబ్ డెస్క్: తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ ఖరారు అయింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను జెఎన్టీయూ విడుదల చేసింది. ఈ నెల 9,10,11,14తేదిల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో ఎంసెంట్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 102 సెంటర్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 79 సెంటర్లను, ఏపీలో 23పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జేఎన్టీయూ తెలిపింది.
ఈ సారి మొత్తం 1,43,165 అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష రాయనున్నారు. హాల్ టికెట్లను గురువారం నుంచి ఈ నెల 7వరకు అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్లను జేఎన్టీయూ అధికారిక వెబ్ సైట్ www.eamcet.tsche.ac.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మాస్క్ లు ధరిస్తూ, డిస్టెన్స్ పాటించాలనీ..శానిటైజర్ వాడాలని సూచించారు.