- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెనక్కి తగ్గిన ట్రంప్
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలన్న నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. అమెరికాలో చదువుకుంటున్న లక్షలాది మంది విదేశీ విద్యార్థులు ట్రంప్ నిర్ణయం వలన అనేక ఇబ్బందులు పడతారని తీవ్ర విమర్శలు రావడం, అక్కడి టాప్ యూనివర్సిటీలు కూడా దీనిపై కోర్టులకు వెళ్లడంతో..ట్రంప్ వెనక్కి తగ్గారు. పాత నిబంధనలు యథాతధంగా అమల్లో ఉంటాయని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రకటించారు. వాస్తవానికి అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్శిటీలకు విదేశీ విద్యార్ధుల ద్వారా భారీగా ఆదాయం లభిస్తోంది.
ట్యూషన్ ఫీజును పూర్తిగా వసూలు చేసుకునే అవకాశముంటుంది. అయితే ఆన్‌లైన్ క్లాసుల ద్వారా మాత్రమే విద్యాబోధన అందించే యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థులు వారి దేశాలకు వెళ్లిపోవాలని ఇటీవలే US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. దాంతో కరోనా సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని యూనివర్శిటీలు విమర్శించాయి. ఇప్పటికే అమెరికాలోని విద్యాసంస్థల్లో వేల మంది విదేశీ విద్యార్ధులు ఆన్‌లైన్ బోధన కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ట్రంప్ నిర్ణయంతో విదేశీ విద్యార్థులంతా తమ దేశాలకు వెళ్లిపోతే భారీగా ఆదాయం కోల్పోయే అవకాశం ఉండటంతో ట్రంప్ ఉత్తర్వులపై అక్కడి యూనివర్సిటీలు కోర్టును ఆశ్రయించాయి. విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం చేసిన మార్పులను దేశంలోని 17 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలు న్యాయస్థానంలో సవాలు చేశాయి. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు వెళ్లిపోయేలా చేయడం క్రూరమైన విషయమే కాకుండా చట్టవ్యతిరేకమైది అంటూ..రాష్ట్రాల తరఫు న్యాయవాదులకు నేతృత్వం వహిస్తున్న మసాచూసెట్స్ అటార్నీ జనరల్ మౌరా హీలీ వ్యాఖ్యానించారు.
హార్వర్డ్, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఐసీఈకి వ్యతిరేకంగా కేసులు దాఖలు చేసిన కొన్నిరోజులకే.. 17 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కూడా కోర్టుకు వెళ్లాయి. మరోవైపు..ప్రముఖ ఐటీ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేశాయి. హార్వర్డ్, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాఖలు చేసిన పిటిషన్‌లో భాగస్వాములవుతున్నట్లు ప్రకటించాయి. దాంతో ఈ వ్యవహారంలో ఎక్కడ బెడిసికొడుతుందోననే ఆందోళనతో..ముందుగానే ఉత్తర్వులను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు.