- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మంలో జర్నలిస్టులకు నిత్యావసరాల కిట్ల అందజేత
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం: ఖమ్మం పట్టణంలోని వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేసే జర్నలిస్టులకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) చేయూతనందించారు. మంగళవారం ఎన్ఎస్‌పీ క్యాంపు రామాలయంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రూ. 5 లక్షల విలువ చేసే కిట్లను యూనియన్ నాయకులు జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గాయత్రి రవి జర్నలిస్టుల కష్టాలను గుర్తించి సాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు అడపాల నాగేందర్, సయ్యద్ ఖదీర్, ఫొటో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Khammam, TUWJ, Journalist, Granite Merchant, donation
Next Story