- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాన్ మార్చిన టీఆర్‌ఎస్.. పార్టీ కమిటీల్లో వారికి ప్రాధాన్యత
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీని వరంగల్ విజయగర్జన తర్వాతనే ప్రకటించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి కమిటీలోకి యువత, మహిళలు, సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతేగాకుండా సామాజిక వర్గాల వారీగా కమిటీలో చోటు కల్పించేందుకు ప్రణాళికలు తయారుచేశారు. కమిటీ రూపకల్పనపై పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాల్లో చురుకైన నేతల వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎలాగైనా రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో నేతలు ముమ్మర యత్నాలు ప్రారంభించారు.
రాష్ట్రంలో ఏ పార్టీకి లేని జంబో కమిటీని టీఆర్ఎస్ 60 మందితో వేస్తుంది. అయితే ఈ సారి కొత్తవారికి కమిటీలో చోటు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్ర కమిటీలో యువత, మహిళలతో పాటు సీనియర్లు, ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నేతలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ కమిటీలో పార్టీ ప్రధానకార్యదర్శి కేటీఆర్ ముద్ర కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పార్టీ ప్రధానకార్యదర్శలకు ప్రాధాన్యముంది. గతంలో పార్టీ ప్రధానకార్యదర్శులుగా పనిచేసిన వారు, ప్రస్తుతం ఉన్నవారికి ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రి పదవులు దక్కాయి. దీంతో పార్టీ కమిటీలో చోటు కోసం నేతలు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ ను కలిసి చేసిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వివరాలు, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పులను చూపుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా పార్టీ ప్రధానకార్యదర్శులుగా పనిచేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికకాగా.. శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బండా ప్రకాశ్ నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా అధినేత అవకాశం కల్పించారు. జోగినపల్లి సంతోష్ ను రాజ్యసభ సభ్యుడిగా నియమించారు. రాములుకు లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. అందులో సత్యవతి రాథోడ్ మంత్రిగా అవకాశం కల్పించారు. దీంతో పార్టీ ప్రధానకార్యదర్శి పదవులకు పోటీ పెరిగింది. కమిటీలో చోటు కోసం ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అయితే సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యం కల్పించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఏ సామాజిక వర్గం నుంచి ఎంత మందికి కమిటీలో చోటు కల్పించాలనే దానిపై పార్టీ అధిష్టానం పార్టీ ముఖ్యనేతలతో చర్చిస్తున్నట్లు పార్టీకి చెందిన ఓ నేత పేర్కొన్నారు. కులాల వారీగా ఇప్పటికే వివరాలు సేకరించగా.. కమిటీలో మాత్రం ఎంతమందికి అవకాశం ఇస్తారనే విషయం మాత్రం గోప్యంగానే ఉంచారు.
ప్రస్తుతం కమిటీలో కొనసాగుతున్న వారిలో పదిశాతం మందికి మాత్రమే తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోన్నట్లు సమాచారం. మిగతా కమిటీలో యువత, మహిళా, సీనియర్లు, ఉద్యమకారులకు స్థానం కల్పించనున్నారు. రాష్ట్ర కమిటీతో పాటు అనుంబంధ కమిటీలైన రైతు, మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిటీల్లో సైతం యువతకు కల్పించనున్నట్లు సమాచారం. ఈ కమిటీలతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరేలా కమిటీలకు రూపకల్పన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనా పార్టీ కమిటీలో ఎవరికి అవకాశం కల్పిస్తారోనని నేతలలో ఉత్కంఠ నెలకొంది.