- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఎంపీటీసీ సస్పెండ్.. షాక్ ఇచ్చిన ఫోరం అధ్యక్షుడు..
దిశ, రామన్నపేట: పార్టీ కార్యకలాపాలకు విరుద్దంగా పని చేస్తున్న రామన్నపేట ఎంపీటీసీ ఎండి రెహాన్ ను స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, అధికారులను బెదిరించడం, దురుసుగా ప్రవర్తించడం, లాంటి పనుల వల్ల అధికార పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆయన తెలిపారు.
ఎంపీపీ, జడ్పీటీసీ ఇతర ప్రజాప్రతినిధుల పట్ల కూడా అమర్యాదగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో, పార్టీ నుండి సస్పెండ్ చేశామని తెలిపారు. అనేకమార్లు నచ్చచెప్పినా ఆయన వైఖరిలో మార్పు రాకపోవడంతోనే, మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ తీర్మానం తో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తిమ్మాపురం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయన తీరులో మార్పు రాకపోవడంతో పాటు ఆయన ప్రవర్తన ఇతర సభ్యులకు అవమాన కరంగా ఉందని, అందుకే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.