‘కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి’

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల వివాదం పై రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ప్రస్తావనకు తెచ్చారు.
కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశం పై సీఎం కేసీఆర్ ఆరేళ్లుగా కేంద్రానికి లేఖ రాస్తున్నారని గుర్తు చేశారు. గతంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ను కొంతకాలం పొడిగిస్తూ ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు. దాని వల్ల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించలేదన్నారు. అందుకే కొత్త ట్రిబ్యునల్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement