- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మీరు రాళ్లతో కొడితే మేము చెప్పులతో కొడుతాం’
దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ప్రజాప్రతినిధులను రాళ్లతో కొట్టి చంపాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై గులాబీ పార్టీ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పందించారు. ‘మీరు రాళ్లతో కొడితే మేము చెప్పులతో కొడుతామని’ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుధీర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన మీకు మా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాజస్థాన్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు కదా.. వాళ్లను కూడా రాళ్లతో కొట్టమంటారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్‌కు రూ.20 కోట్లు ఇచ్చి టీపీసీసీ పదవి తెచ్చుకున్నావని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేయలేదా..? ఇలానే మాటల గారడి చేస్తే జోకర్‌లా మిగిలిపోతావ్ అని సుధీర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని.. వచ్చి రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇప్పుడెమో ఏకంగా టీపీసీసీ కట్టబెట్టడంతో రేవంత్‌కు అడ్డు చెప్పేవారే లేరని, దీంతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్‌ను నిషేధిత జాబితాలో చేర్చాలా..?
టీపీసీసీ పదవి వచ్చాక రేవంత్ మావోయిస్టులు మాట్లాడే భాషను వాడుతున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఇలాంటి భాష మాట్లాడితే కాంగ్రెస్‌ను నిషేధిత జాబితాలో చేర్చాలా అని ప్రశ్నించారు. రాజస్థాన్‌లో ఇతర గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే తప్పుకాదా అని అడిగారు.అక్కడ లేని తప్పు కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు టీఆర్ఎస్‌లో చేరితే తప్పేంటని రివర్స్ కౌంటర్ ఇచ్చారు.