- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నో రిజిస్ట్రేషన్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరం?
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో ఓటుకోసం క్షణక్షణం పోరాడుతున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై మాత్రం నిర్లక్ష్యం వహించారు. తమ ఓటు అంత విలువైంది కాదనుకున్నారేమో కానీ రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉండటం గమనార్హం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో డిగ్రీ పూర్తి చేసిన వారు ఏడుగురున్నారు. అయితే అర్హత ఉన్నా.. ముగ్గురు రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉండటం అంతుపట్టడం లేదు. జనాలకు చెప్పే నేతలే తమ ఓటు హక్కు రిజిస్ట్రేషన్‌ను ఎలా విస్మరిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కేఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆయన స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పట్టభద్రుల ఓటు హక్కును పొందారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ బీటెక్ పూర్తి చేశారు. ఆయన మహబూబాబాద్‌లో ఓటు హక్కు పొందారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఎంఏ పొలిటికల్ సైన్సు పూర్తి చేశారు. హన్మకొండ నుంచి ఓటు హక్కును పొందారు. ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ ఎంఏ పొలిటికల్ సైన్సు పూర్తి చేశారు. ములుగు జిల్లా కేంద్రం నుంచి ఓటు హక్కు పొందారు. మిగతా ఎమ్మెల్యేలైన చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, డీఎస్ రెడ్యానాయక్ డిగ్రీ పూర్తిచేసినట్టు గత అసెంబ్లీ ఎన్నికలో అఫిడవిట్లలో పేర్కొన్నారు.
అయితే ఎందుకనో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటు హక్కును నమోదు చేసుకోకపోవడం గమనార్హం. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లకు కూడా ఎమ్మెల్సీ ఓటును రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.