- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రశ్నించే వాళ్లు నా బామర్దులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
by Shyam |

X
దిశ, నాగర్ కర్నూల్: నియోజకవర్గానికి కాపలదారుడిలా పనిచేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఈదమ్మ ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వయసులో పెద్దవాడినే అయినా రాజకీయాల్లో పసివాడినేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సాగు, తాగునీరు, రోడ్లు, చివరకు మెడికల్ కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు. కాపలదారుడిగా ఉంటూ దృష్టుల నుంచి కాపాడుతూ అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. గతంలో పాలకులు ఇంజనీరింగ్ కళాశాల అమ్ముకున్నారని కానీ నేను తిరిగి తెస్తానన్నారు. సమావేశం చివర్లో అభివృద్ధి అంశంపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఓ వ్యక్తిని బామ్మర్దిగా చెప్పారు. ప్రతి ఊర్లో నాకో దోస్తు, ఓ బామ్మర్ది ఉంటాడని వారిని పట్టించుకోన్నని అన్నారు.
Next Story