- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేకపోతే ఫిర్యాదు చేస్తాం.. అధికారులకు టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక
దిశ, జగదేవపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ అధికారులు గ్రామం నుంచి తొలగించడం సరికాదని టీఆర్ఎస్ జిల్లా యూత్ కార్యదర్శి ముచపతి భాలయ్య, అయిలయ్య గౌడ్ లు అన్నారు. ఆదివారం జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడపలో పలువురు రైతులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని తొలగించడం సరికాదన్నారు. మండలంలో అతి పెద్ద గ్రామమైన మునిగడపలో కాకుండా చిన్న, చిన్న గ్రామాల్లో ఐకేపీ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఐకేపీ సీసీ నిర్లక్ష్యం మూలంగానే గ్రామం నుంచి కొనుగోలు కేంద్రాన్ని తొలగించినట్లు వారు వాపోయారు.
రైతు వేదిక వద్ద చిన్న చిన్న పొరపాట్లు చూపించి గ్రామంలో నుంచి కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేస్తే రైతులతో కలిసి ఐకేపీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. తొలగొంచిన కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో రైతులతో కలసి మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిలకు ఐకేపీ అధికారులపై ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుర్రం సుధాకర్, రైతులు మల్లేశం, రాములు, నాగులు, సంతోష్, దశరథ, సత్తయ్య, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.