ఎమ్మేల్యే రఘునందన్ రావు ఓటు ఎవరికి వేసిండు..?

by Shyam |   ( Updated:2021-12-14 05:10:36.0  )
trs copy
X

దిశ, దుబ్బాక : మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పది ఓట్లు లేవు. అయిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కావాలని ఒక కౌన్సిలర్‌ను నిలబెట్టి బలిపశువును చేశారని టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఆ అభ్యర్థికి ఎమ్మెల్యే రఘునందన్ రావు తన ఓటు వేసిండో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మట్ట మల్లారెడ్డి ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా కలసి కట్టుగానే ఉన్నామనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమన్నారు. ఎమ్మెల్సీ కాదు ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్నారు. కొంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఓటర్లు మాత్రం ఏకపక్షంగా టీఆర్ఎస్‌కు ఓట్లేసి గెలిపించడం జరిగిందని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, మున్సిపల్ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story