- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏకగ్రీవ ఎమ్మెల్సీకి ఘనంగా సన్మానం.. భారీగా తరలివచ్చిన నాయకులు..
by Shyam |

X
దిశ హన్మకొండ టౌన్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆయన్ను సన్మానించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పోచం పల్లికి రిటర్నింగ్ అధికారి గెలుపొందిన సర్టిఫికెట్ అందజేశారు.
శుక్రవారం హన్మకొండలోని బాలసముద్రంలో పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అభినందన మరియు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు మర్రి యాదవ రెడ్డి, ఆజీజ్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story