సహనానికి పట్టాభిషేకం.. థాంక్యూ కేసీఆర్ సార్

by Shyam |   ( Updated:2021-11-20 06:33:54.0  )
Parakala TRS leaders
X

దిశ, పరకాల: మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కేటాయించటం పట్ల హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంగళ నారాయణరెడ్డి నేతృత్వంలో ‘సిరికొండ’ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో బాణసంచా కాలుస్తూ, డప్పు కళాకారుల నృత్యాలతో అత్యంత ఘనంగా సంబురాలు నిర్వహించారు. సుమారు 16 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఈ సంబురాల్లో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.

మండలంలో ఇప్పటివరకు అభివృద్ధి జరిగిందంటే అది సిరికొండ మధుసూదనాచారి వల్లనే అని అప్పటి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు మండలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ప్రస్తుత ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ.. మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే సహనానికి పట్టాభిషేకం చేసినట్లు ఉందంటూ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ సర్పంచ్, గోవిందాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, శాయంపేట ఎంపీటీసీ చంద్రప్రకాష్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గుర్రం రవీందర్, టీఆర్ఎస్వీ నాయకుడు కొమ్ముల శివ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేందర్, రాజయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు.

epaper – 4:00 PM TS EDITION (20-11-21) చదవండి

Advertisement

Next Story