- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విత్తన గణేష్‌ను పూజిద్దాం:మర్రి రాజశేఖర్‌రెడ్డి
by Shyam |
X
దిశ, కంటోన్మెంట్: పర్యావరణ పరిరక్షణ కోసం విత్తన గణపతులను పూజిద్దామని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బోయిన్‌పల్లిలోని తన నివాసంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, కార్పొరేటర్లకు విత్తన గణేష్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రోజువారీ పూజలు అందుకునే ఈ గణేశునిలోని విత్తనం ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలకెత్తుతుందన్నారు. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత వేప మొక్కను ఇంటి ఆవరణలోనే నాటుకోవచ్చనని తెలిపారు.
Advertisement
Next Story