- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి గారూ.. గిదేంది సారూ..?
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు రాజకీయ నేతలు మాత్రం తమ స్వార్థానికి అమాయకపు ప్రజలను బలిచేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే సాగర్ ఉపఎన్నికతో నాగార్జునసాగర్ నియోజకవర్గమంతా అతలాకుతలం అవుతోంది. అక్కడి ప్రజలు కరోనా మహమ్మారి నుంచి ఇప్పట్లో బయటపడేలా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పురపోరులో భాగంగా నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగానే అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ జనసమీకరణతో ప్రచారం నిర్వహించడం నకిరేకల్‌లో కలకలం రేపుతోంది.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నకిరేకల్ పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగానే మూడు నాలుగు చోట్ల సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. వీటికి టీఆర్ఎస్ పార్టీ భారీగా జనసమీకరణ చేసింది. మంత్రి ప్రచారం కోసం ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇలా జనసమీకరణ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల ప్రాణాల పణంగా పెట్టడం ఏంటిని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.