వ‌రంగ‌ల్‌‌లో బీజేపీ ఉక్కిరిబిక్కిరి

by Anukaran |   ( Updated:2021-03-06 01:32:14.0  )
TRS fires on BJP
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ బీజేపీ నేత‌ల‌కు పెద్ద క‌ష్టమే వ‌చ్చిప‌డింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్ర ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంద‌ని పేర్కొంటూ టీఆర్ఎస్ ఆందోళ‌న‌ల‌కు శ్రీకారం చుడుతోంది. వ‌రంగ‌ల్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేయ‌డం లేద‌న్న అంశంతో బీజేపీ నేత‌లు మంచి దూకుడుతో వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో వారికి ఎలా క‌ళ్లెం వేయాలో తెలియ‌క ఇన్నాళ్లు తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు త‌క‌మిక అయ్యారు. కోచ్ ఫ్యాక్ట‌రీ విష‌యంలో కేంద్రం యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వేలాది మంది నిరుద్యోగులు నిరాశ‌లో మునిగిపోయార‌ని టీఆర్ఎస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

బీజేపీకి చుక్కెదురేనా..?

స్మార్ట్‌సిటీకి రూ.190కోట్లు కేటాయించింద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌వాటాగా నిధులు కేటాయించ‌డం లేదని, అలాగే అమృత్‌, హృద‌య్ ప‌థ‌కాల ద్వారా కూడా చారిత్ర‌క వ‌రంగ‌ల్ న‌గ‌రానికి కేంద్రం ఎంతో చేసింద‌న్న విష‌యాన్ని బీజేపీ శ్రేణులు బాగా జ‌నంలోకి తీసుకెళ్ల‌గ‌లిగాయి. కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు కూడా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు. అయితే కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పనులను ఎప్పుడు ప్రారంభించనున్నారంటూ సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ సమాధానమిచ్చింది. దేశంలో ఎక్కడా ప్రస్తుతానికి లేదా భవిష్యత్తులో రైల్వేశాఖకు కోచ్‌ ఫ్యాక్టరీల అవసరమే లేదని పేర్కొంది. దీంతో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయ‌కుండా.. కేవ‌లం ప్ర‌చారం కోస‌మే బీజేపీ రాజ‌కీయాల‌కు ఇన్నాళ్లు నినాదాన్ని వాడుకుంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed