రాజ్యసభకు కేకే, సురేష్ రెడ్డి

by Shyam |   ( Updated:2020-03-12 06:57:17.0  )
రాజ్యసభకు కేకే, సురేష్ రెడ్డి
X

దిశ, హైదరాబాద్
తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. శుక్రవారం టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్‌రెడ్డిలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.

Advertisement

Next Story