అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..

by Shyam |
అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..
X

దిశ, ఆందోల్‌: రైతుల సంక్షేమం కోసం కొత్త చట్టాన్ని బీజేపీ తీసుకు వచ్చిందనీ, ఉనికిని కాపాడుకునేందుకే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర దళిత మోర్చ ఉపాధ్యక్షుడు కె.జగన్‌ అన్నారు. పార్లమెంట్‌‌లో నూతన వ్యవసాయ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా ‘భారత వ్యవసాయ రంగంలో నవశకం’కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తుంటే మీటర్లను ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ, రైతులను తప్పుదోవ పట్టించి దుబ్బాక ఉప ఎన్నికల్లో లబ్దిపొందేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందన్నారు.

Advertisement

Next Story