- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు హైదరాబాద్ పై అవగాహన లేదని ఎవరన్నారు : మేయర్
దిశ,వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కుమార్తె, కార్పొరేటర్ గద్వాల విజయ లక్ష్మి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మేయర్ ఎంపిక విషయంలో పలువురు కార్పొరేటర్లు విజయలక్ష్మిని వ్యతిరేకించారు. హైదరాబాద్ పై అవగాహన లేని విజయలక్ష్మిని మేయర్‌ను చేయడం సమంజసం కాదని అన్నారు. అయితే మేయర్ గా నియామకం జరిగిన తరువాత మీడియాతో మాట్లాడిన విజయ లక్ష్మి.. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మేయర్ గా మహిళలకు ఎలాంటి హామీ ఇస్తారన్న ప్రశ్నలకు స్పందించిన కేకే కుమార్తె హైదరాబాద్ లో మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు. తనపై వస్తున్న విమర్శలపై.. మేయర్ మాట్లాడుతూ నాకు నగరంపై అవగాహన లేదని ఎందుకు అంటున్నారు. నేను 2007లో అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చా. అప్పటి నుండే రాజకీయాల్లో ఉన్నా. నాకో విజన్ ఉంది. ఆ విజన్ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.