- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలికి షాక్

X
దిశ, అశ్వాపురం: ప్రస్తుతం టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న మొర్వినేని చంద్రకళను పదవి నుండి తొలిగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఎటువంటి పార్టీ కార్యకలాపాలు నిర్వహించనందుకు గాను చంద్రకళను తొలిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి పార్టీ మహిళా అధ్యక్షురాలిగా మాజీ జెడ్పీటీసీ తోకల లతను నియమించనున్నట్లు సమాచారం. పార్టీలో పనిచేయని వారిపై వేటు తప్పదని ఎమ్మెల్యే ప్రకటించినట్లుగానే తెలుస్తోంది. ఇటీవల పార్టీ మండల యువజన అధ్యక్షుడిని తొలగించిన విషయం తెలిసిందే. వారం రోజులు కాకముందే మహిళా అధ్యక్షురాలిపై వేటువేయడంతో పార్టీలో అసలు ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే రేగా వ్యూహం ఏమిటి..? అనే అంశం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Next Story