రాష్ట్రాభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యం: మంత్రి అజయ్ కుమార్

by Sridhar Babu |
రాష్ట్రాభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యం: మంత్రి అజయ్ కుమార్
X

దిశ‌, ఖ‌మ్మం: తెలంగాణ రాష్ట్ర సాధన- అభివృద్ధి లక్ష్యంగా 20 ఏళ్ల క్రితం టీఆర్‌ఎస్ ఆవిర్భవించిందని రవాణా‌శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం జిల్లా కేంద్రం గట్టయ్య సెంటర్‌లోని పార్టీ కార్యాలయంలో మంత్రి టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ఏకైక లక్ష్యంగా పని చేసిందన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు. అనంత‌రం మంత్రి అజ‌య్ పార్టీ నాయ‌కుల‌తో క‌ల‌సి మయూరి సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసానిలక్ష్మీ నారాయణ, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags: minister ajay kumar, trs parmation day, celebrations, khammam

Advertisement

Next Story