తుల ఉమ ఎంట్రీతో సీన్ రివర్స్.. దాడికి దిగిన TRS, BJP శ్రేణులు (వీడియో)

by Anukaran |   ( Updated:2023-04-13 18:03:09.0  )
తుల ఉమ ఎంట్రీతో సీన్ రివర్స్.. దాడికి దిగిన TRS, BJP శ్రేణులు (వీడియో)
X

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతగా జరుగుతోంది. కానీ, కొన్ని చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నేతలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాజీ జడ్పీ చైర్మన్, బీజేపీ నేత తుల ఉమ హిమ్మత్ నగర్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి రాగా.. టీఆర్ఎస్ శ్రేణులు ఆమెను అడ్డుకున్నారు.

తుల ఉమ స్థానికేతర నేత కావడంతో వారు ఆందోళనకు దిగారు. కారు దిగి వెళ్తున్న ఉమను అడ్డుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed