- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షోభంలో మణిపూర్ సర్కార్.. గద్దెనెక్కేందుకు కాంగ్రెస్ వ్యూహాలు?
గువహతి: మణిపూర్ సర్కార్ సంక్షోభం వైపుగా ప్రయాణిస్తున్నది. ఇన్నాళ్లు బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనక్కి వెళ్తున్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర బీజేపీ సర్కారుకు మద్దతును ఉపసంహరించుకున్నారు. ఇందులో ఉపముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులూ ఉండటం గమనార్హం. అదీగాక, ఇందులో కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలియడంతో రాష్ట్రంలో సర్కారు మార్పు తప్పదా? అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదీగాక, మాజీ సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.
ఈ మేరకు గవర్నర్‌ను కలిసి తమ వద్ద మెజార్టీ ఎమ్మెల్యేలున్నారని, సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలని అడగబోతున్నట్టు సమాచారం. కొన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు (ఉప ముఖ్యమంత్రి వై జాయ్ కుమార్ సింగ్, క్యాబినెట్ మంత్రులు ఎన్ కయిసీ, ఎల్ జయంత కుమార్ సింగ్, లెట్పావో హవోకిప్‌లున్నారు) తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్ సుభాష్‌చంద్ర సింగ్, టీటీ హవోకిప్, శామ్యూల్ జెండాయిలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ రబింద్ర సింగ్, స్వతంత్ర ఎమ్మెల్యే షహబుద్దీన్‌లూ ప్రభుత్వానికి తమ మద్దతు వెనక్కి తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మార్పులు రానున్న రాజ్యసభ ఎన్నికలనూ ప్రభావితం చేయనున్నాయి.
ఇప్పుడే ఎందుకు?
మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తు్న్నది. 2017లో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో కలిసిన ఎమ్మెల్యేలపై ఆంక్షలు విధించింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌కు అనర్హతవేటు వేసింది. దీనికి ముందు బీజేపీలో చేరిన కాంగ్ ఎమ్మెల్యే శ్యాం కుమార్ సింగ్ శాసన సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. కాగా, 2017లో బీజేపీలో చేరిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటించాలన్న పిటిషన్ ప్రస్తుతం ట్రిబ్యునల్ స్పీకర్ ఖేంచంద్ సింగ్ విచారణలో ఉన్నది. రాజీనామాలు, అనర్హతలతో రాష్ట్ర అసెంబ్లీలో బలం 52కు పడిపోయింది. ఈ సందర్భంలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తున్న కారణంగా పలువురు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నారన్న వాదనలూ వస్తున్నాయి.
2017లో 60 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లతో కాంగ్రెస్ సింగిల్ మెజార్టీ పార్టీగా అవతరించింది. కానీ, 21 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇతర పార్టీల నుంచి మద్దతును కూడగట్టుకుని అధికారాన్ని సంపాదించుకుంది. అందులో ఎన్‌పీపీప, ఎన్‌పీఎఫ్, ఎల్‌జేపీ, టీఎంసీ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ ఉన్నారు. బీరెన్ సింగ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ సర్కారుకు మద్దతునిచ్చారు. అయితే, తాజాగా, శ్యాంకుమార్ సింగ్‌పై అనర్హత వేటుపడటంతో అధికారంలోని బీజేపీ బలం 23కి పడిపోయింది. కాంగ్రెస్‌కు 20 మంది సపోర్ట్ ఉన్నది. ఒకవేళ మద్దతు ఉపసంహరించిన శాసన సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతునిస్తే రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దానికోసం రాష్ట్ర కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.