- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల అలసత్వంతో తప్పని తిప్పలు….
దిశ, అసిఫాబాద్: వైద్యాధికారుల అలసత్వంతో జిల్లా కేంద్రంలోని సామాజిక ఆసుపత్రులకు వ్యాక్సిన్ రెండో డోస్ కోసం వచ్చినవారు నిరీక్షించి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో గల ఒక భవనంలో అధికారులు వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మంగళవారం కూడా అదేవిధంగా ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా లోపంతో భవనంలో విద్యుత్ సరఫరా కాలేదు. దీనితో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ దానిపై దృష్టి సారించలేదు.
అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకున్న అనేక మంది సామాజిక ఆసుపత్రికి వచ్చి గంటల తరబడి నిరీక్షించారు. ఉదయం 8 గంటలకి టీకా కేంద్రానికి చేరుకున్న 60 మందికి పైగా లబ్ధిదారులు ఎదురు చూసి ఇంటి దారి పట్టారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటిండెంట్ స్వామి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే సామాజిక ఆసుపత్రిలో తాత్కాలిక వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేయడంతో కొంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఏది ఏమైనా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన వైద్య అధికారులు జిల్లాలో మొద్దు నిద్ర పోతున్నారనడానికి ఈ నాటి సంఘటన నిలువుటద్దంగా నిలిచింది. ఇంత ప్రాముఖ్యత కలిగిన వ్యాక్సినేషన్ కూడా అధికారులు దృష్టి సారించకపోవడం, పట్టనట్టు వ్యవహరించడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ లో అత్యంత వెనుకబడిన జిల్లాగా ఆసిఫాబాద్ ఉండగా ఇటువంటి సంఘటన జరగడం చర్చకు దారితీసింది. వామపక్ష నాయకులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.