- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైప్ లైన్ కోసం తవ్వారు.. వదిలేశారు
దిశ, ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనులలో భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆదర్శ నగర్ కాలనీ విధులలో గుంతలు తవ్వి పైప్ లైన్ వేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు పైప్ లైన్ పైన వేసిన మట్టి వర్షపు నీటికి కొట్టుకుపోయి కయ్యగా మారడంతో అందులో నుండి నీరు ప్రవహించి జాతీయ రహదారిపై పారుతుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కాలనీ రోడ్లు గుంతలుగా మారడంతో ప్రజలు కాలినడకన వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుంతల్లో వర్షపు నీరు చేరి దుర్గంధం వెదజల్లుతుండడంతో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో కాలినడకన వెళ్లేవారు తమ ఇండ్లకు చేరేందుకు నానా తంటాలు పడుతూ, అదుపు తప్పి కింద పడిపోయి గాయాల పాలవుతున్నారు. పైప్ లైన్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ గోతులపై సీసీ రోడ్డు వేయాల్సి ఉండగా పట్టించుకోక పోవడంతో గత కొన్ని నెలలుగా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ నిర్మాణం పై నుండి సీసీ రోడ్డు వేసి కాలనీ వాసులు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.