‘‘పవన్ అన్నయ్య ఆశీస్సులు ఉంటాయి’’

by Shyam |

‘‘యంగ్ హీరో నితిన్‌కు వాళ్ల అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆశీస్సు ఎప్పుడూ ఉంటాయని’’ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. నితిన్ హీరోగా రష్మిక కథానాయికగా ‘‘ఛలో’’ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. సోమవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ కాబోతుంది అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా అల్రెడీ నేను చూశాను. సినిమా చాలా బాగుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని, నేను ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. హీరోయిన్ రష్మిక మంచి సక్సెస్ వేవ్‌లో ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆ తర్వాత ‘భీష్మ’.. అదే సక్సెస్ కంటిన్యూ చేయాలి. నీకు మరెన్నో విజయాలు రావాలి. బెంగళూరు నుంచి ఇక్కడకు 50 నిమిషాలే ప్రయాణం. సో.. వర్రీ అవ్వవద్దు. మీరెప్పుడు మాకు దగ్గరగానే ఉంటారు. ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్‌లో రెండున్నాయని వాటిని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని దీమా వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

Next Story