అమ్మకాల్లో 20 శాతం వృద్ధి లక్ష్యం : ట్రయంఫ్ ఇండియా!

by  |
అమ్మకాల్లో 20 శాతం వృద్ధి లక్ష్యం : ట్రయంఫ్ ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్‌ (India)లో అమ్మకాలు 15-20 శాతం వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్టు ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ (Triumph motor cycle) కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రీమియం మోటార్‌ సైకిల్ విభాగంలో మందగమనాన్ని అధిగమించేందుకు కొత్త ఉత్పత్తులను పోటీ ధరల్లో తీసుకురావడంపై దృష్టి సారించినట్టు తెలిపింది. ‘గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు (sales)10 శాతం తక్కువగా ఉన్నాయని, అయితే, ప్రస్తుత సంవత్సరానికి రిటైల్ అమ్మకాల్లో 15-20 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు’ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షోయెబ్ ఫరూక్ (shoyeb Faruk) వెల్లడించారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 800 యూనిట్లను విక్రయించినట్టు షోయెబ్ ఫరూక్ తెలిపారు. ప్రీమియం సెగ్మెంట్ (premium segment)మోటార్‌ సైకిల్ విభాగం ప్రస్తుతం క్షీణిస్తోంది. కరోనా (corona) పరిస్థితుల కారణంగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, క్షీణిస్తున్న పరిస్థితుల్లోనూ తాము మెరుగైన స్థితిలోనే ఉన్నామని షోయెబ్ ఫరూక్ పేర్కొన్నారు. గత రెండు, మూడు నెలలుగా మొత్తం టూ-వీలర్ పరిశ్రమ 25-30 శాతం క్షీణతను చూసిందని, ప్రీమియం విభాగం గతేడాదితో పోలిస్తే 50 శాతానికి మించి తక్కవ నమోదైనట్టు షోయెబ్ ఫరూక్ తెలిపారు.



Next Story