సీపీఎల్‌లో తిరుగులేని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్

by  |
సీపీఎల్‌లో తిరుగులేని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
X

దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్(Trinbago Knight Riders) అత్యంత విజయవంతమైన జట్టు(Successful Team)గా రికార్డుల కెక్కింది. 2013లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించినప్పుడు ట్రిన్‌బాగో రెడ్ స్టీల్(Trinbago Red Steel) జట్టుగా లీగ్‌లో అడుగుపెట్టింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో(Trinidad and Tobago) ప్రాంత జట్టుగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ హోం గ్రౌండ్‌(Home ground)గా ఈ జట్టు సీపీఎల్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నది.

కాగా, 2015లో ఈ ఫ్రాంచైజీ(Franchisee)కి చెందిన వాటాల(Shares)ను బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Bollywood actor Shahrukh Khan), వ్యాపారవేత్త జే మెహతా(Businessman Jay Mehta), ఆయన భార్య జూహీచావ్లా కొనుగోలు చేశారు. అప్పటికే ఐపీఎల్‌(IPL)లో ఖాన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) పేరుతో జట్టు ఉంది. దీంతో ట్రిన్‌బాగో రెడ్ స్టీల్(Trinbago Red Steel) జట్టు పేరును ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌(Trinbago Knight Riders)గా మార్చారు. అదే ఏడాది తొలిసారి ట్రిన్‌బాగో జట్టు సీపీఎల్ టైటిల్(CPL title) గెలవడం విశేషం.

మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీ..

వెస్టిండీస్‌(West Indies)గా పిలుచుకునే అనేక దీవుల్లో అతిపెద్ద ద్వీప దేశం(The largest island nation) ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్లే కాకుండా చూసే వాళ్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ. దీంతో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్(Trinbago Knight Riders) జట్టుకు కూడా అభిమానులు(Fans) భారీ సంఖ్యలో ఉంటారు. సీపీఎల్(CPL) తొలుత ప్రారంభించినప్పుడు ఈ జట్టే విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు.

కానీ 2013, 2014లో 4వ స్థానంతోనే సరిపెట్టుకుంది. అయితే, ఈ జట్టులో షారుఖ్ వాటాలు (shares) కొనుగోలు చేసిన తర్వాత అనూహ్యంగా బలమైన జట్టు(Strong team)గా మారిపోయింది. కీరన్ పొలార్డ్( Kieran Pollard) వంటి బ్యాట్స్‌మెన్( Batsman) నాయకత్వంలో సీపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా మారిపోయింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లకు ఎంత ఆదరణ ఉందో.. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు అలాంటి పాపులారిటీనే ఉంది.

గత ఏడాది ఢిఫెండింగ్ ఛాంపియన్‌(Defending Champion)గా బరిలోకి దిగిన ట్రిన్‌బాగో((Trinbago) జట్టు హ్యాట్రిక్ (Hat-trick) విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ ప్లేఆఫ్స్ దశ (Playoffs phase)లో ఓడిపోయి మూడో స్థానానికే పరిమితం అయ్యింది. గత సీజన్ చివర్లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయినా, ఈసారి మాత్రం ట్రిన్‌బాగోనే టైటిల్ ఫేవరెట్‌(
Title Favorite)గా భావిస్తున్నారు.

జట్టు బలాబలాలు..

వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మాన్ కీరన్ పొలార్డ్(Kieran Pollard) నాయకత్వం వహిస్తున్న ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (Trinbago Knight Riders) జట్టులో మొత్తం 17మంది క్రీడాకారులు(Players) ఉన్నారు. నలుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్(Specialist batsmen), ఐదుగురు ఆల్‌రౌండర్లు(Five all-rounders), ఇద్దరు వికెట్ కీపర్లు(Two wicket-keepers), ఆరుగురు బౌలర్ల(six bowlers)తో ట్రిన్‌బాగో జట్టు బరిలోకి దిగుతున్నది.

వీరిలో 11మంది వెస్టిండీస్ ఆటగాళ్లు(11 West Indies players) కాగా, ఇద్దరు కివీస్(Kiwis), జింబాబ్వే( Zimbabwe), ఇండియా ( India), ఆస్ట్రేలియా(Australia), యూఎస్ఏ (USA)ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సీపీఎల్‌(CPL)లో ఆడుతున్న తొలి భారతీయ క్రికెటర్ ప్రవీణ్ థాంబే(Indian cricketer Praveen Thombe) ఈ జట్టులోనే ఉన్నాడు. డారెన్ బ్రాడో, కొలిన్ మున్రోల(Darren Bravo, Colin Munro)తో టాప్ ఆర్డర్ బలంగా ఉంది.

ఇక కీరల్ పొలార్డ్, సునిల్ నరైన్, బ్రావోలు(Kieran Pollard, Sunil Narine, Bravo) ఐపీఎల్‌లో బ్యాట్లు ఝులిపించిన రికార్డు(Record) ఉన్నది. బౌలింగ్(Bowling)విభాగంలోనే అంతర్జాతీయ అనుభవం ఉన్న బౌలర్లు లేనట్లు అనిపిస్తున్నా, డేవ్ బ్రావో, సునిల్ నరైన్‌లు సామర్థ్యం మేరకు రాణిస్తే ప్రత్యర్థుల(Opponents)ను గడగడలాడించగలరు. టీ20 స్పెషలిస్ట్‌(T20 Specialist)గా పేరొందిన కివీస్ ఆటగాడు బ్రెండెన్ మెకెల్లమ్(Brendan McCullum) ఈ జట్టుకు కోచ్‌(Team Coach) గా ఉండటం అదనపు బలంగా చెప్పుకోవచ్చు. కొవిడ్ కారణంగా ఈ సారి రెండు స్టేడియాల్లో మాత్రమే సీపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే, ఆ రెండు స్టేడియాలూ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (Trinbago Knight Riders)హోం గ్రౌండ్స్ కావడం కలిసొచ్చే అంశం.

జట్టు సభ్యులు:

కీరన్ పొలార్డ్ (కెప్టెన్), డారెన్ బ్రావో, లెండిల్ సిమాండ్స్, కొలిన్ మున్రో, సికందర్ రజా, డ్వేన్ బ్రావో, సునిల్ నరైన్, ఖారీ పెర్రీ, టియాన్ వెబ్‌స్టర్, టిమ్ సిఫర్ట్, అమిర్ జంగూ, ఫవాద్ అహ్మద్, అలీ ఖాన్, అకీల్ హొసేన్, జేడెన్ సీల్స్, అండర్సన్ ఫిలిప్, ప్రవీణ్ థాంబే,

కోచ్ : బ్రెండెన్ మెకల్లమ్, యజమానులు : షారుఖ్ ఖాన్, జూహీచావ్లా, జే మెహతా

విజేతలు : 2015, 2017,2018
గత సీజన్ : 3వ స్థానం


Next Story