తృణమూల్ మెరుపుల్

by Shamantha N |
తృణమూల్ మెరుపుల్
X

కోల్‌కతా: ఐదు అసెంబ్లీల ఎన్నికలు జరిగినా అందరి కళ్లు పశ్చిమ బెంగాల్‌పైనే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు బెంగాల్ వేదికైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తృణమూల్ మెరుపు మెరుస్తున్నది. అంచనాలకు అందకుండా 207 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. రెండు సార్లు అధికారంలో రెండు దఫాలు కొనసాగినా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంలో టీఎంసీ సఫలమైనట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఎనిమిది విడతల్లో 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

బీజేపీ సూపర్ పర్ఫార్మెన్స్..

గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ భారీగా తన పట్టును పెంచుకున్నట్టు కనిపిస్తున్నది. మూడు స్థానాల నుంచి భారీ విజయాలను ఈ ఎన్నికల్లో నమోదు చేయనుంది. ఇప్పటి వరకు 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. కాగా, లెఫ్ట్, కాంగ్రెస్ తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఫలితాల అంచనాలున్నాయి. లెఫ్ట్ కూటమి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed