గానగంధర్వుడికి ఘన నివాళి..!

by Shyam |
గానగంధర్వుడికి ఘన నివాళి..!
X

దిశ, సిద్దిపేట: సిద్ధిపేట స్థానిక శివానుభవ మంటపంలో బ్రాహ్మణ ఆరాధ్య శైవ మహాపీఠం, జిల్లా బ్రాహ్మణ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ఆరాధ్య శైవ మహాపీఠం సభ్యులు, సిద్ధిపేట జిల్లా బ్రాహ్మణ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా శ్రీశైవ మహాపీఠం అధ్యక్షుడు రామగిరి శివకుమార్ శర్మ మాట్లాడుతూ.. బాలసుబ్రహ్మణ్యం తన గానామృతంతో ఐదు దశాబ్దాలు భారతీయ శ్రోతలను ఓలలాడించారని అన్నారు. కొన్ని కోట్ల మనసులను దోచుకున్న మహనీయుడని కొనియాడారు.

Advertisement

Next Story