- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడిసెలు 70… బిల్లు 17 లక్షలు
దిశ, మహబూబాబాద్: గిరిజనులకు 100 యూనిట్ విద్యుత్ వినియోగం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని మురిసిన తండా ప్రజలకు విద్యుత్ బిల్లులను చూసి ఖంగుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసరి గ్రామ శివారు రేకుల తండా 90 గృహాలు ఉండగా, 70 గృహ లకు విద్యుత్ మీటర్ కనెక్షన్ లు తీసుకున్నారు.70 మందిలో కొంత మంది 2019 సంవత్సరం లో అప్పటికి ఉన్న పూర్తి బకాయిలు చెల్లించారు.
ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయగా, అప్పటి నుండి విద్యుత్ శాఖాధికారులు బిల్లులు వసూళ్లు చేయలేదు. బుధవారం ఒక్కసారిగా విద్యుత్ అధికారులు తండా కు వచ్చి బిల్లు లు ఇవ్వగా ఒక్కొక్క ఇంటికి 20 వేల నుండి 40 వేల వరకు రాగా తండా ప్రజలు ఖంగుతిన్నారు. ఈ సందర్భంగా పలువురు తండా ప్రజలు మాట్లాడుతూ..తండాలో ఎక్కువగా విద్యుత్ వియోగం చేయలేదని వాపోయారు.ఉచితం అని చెప్పి రెండు ఏండ్ల తర్వాత బిల్లు చెల్లించమని విద్యుత్ అధికారులు తెలియజేయడం విడ్డురంగా ఉందన్నారు.
ఒక్కక్క ఇంటికి 20 వేల కు పైగా మొత్తం 17 లక్షల కు పైగా కరెంట్ బిల్లు రావడంతో ఒక్కసారిగా ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ బిల్లులు పూర్తి గా మాఫీ చేయాలని కోరుతున్నారు.