అధికారుల పై గిరిజనుల దాడి

దిశ, వెబ్‌డెస్క్: ఎక్సైజ్ సిబ్బంది పై గిరిజనులు దాడి చేసిన ఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని పాలెరు మండలం బకలపనుకులో నాటుసారా అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయింది. తనిఖీల కోసం వచ్చిన అధికారుల పై గ్రామంలోని గిరిజనులు దాడికి దిగారు. ఈ దాడిలో కానిస్టేబుల్ గౌరీశంకర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.. దీంతో క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ భాస్కరరావు అనే వ్యక్తితో సహా మరో ఏడుగురి పై కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement